దుద్దెడ ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం..
- ముగ్గురికి గాయాలు
- వీరవ్వ పరిస్థితి విషమం.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కొండపాక, నవంబర్ 23( విజయ క్రాంతి):దుద్దెడ జనగామ ఎక్స్‌రోడ్డు(Jangaon X-Road) వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురికి గాయాలయ్యాయి. రాంపల్లి గ్రామానికి చెందిన వీరవ్వ (45) తన కుమారుడి కోసం ఎక్స్‌రోడ్డు వద్ద వేచి ఉండగా, తిమ్మారెడ్డిపల్లి నుంచి బంతిపూలతో వస్తున్న టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం అదుపుతప్పి ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో వీరవ్వతో పాటు వాహనంపై ప్రయాణిస్తున్న రాజయ్య (59), యాదవ్వ (46)లకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ నవీన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ముగ్గురినీ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.