బీజేపీ మహాపాదయాత్ర విజయవంతం
బోయినపల్లి ప్రవీణ్ రావ్
ముకరంపుర, నవంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఆధ్వర్యంలో కరీంనగర్ నందు నిర్వహించిన బీజేపీ మహా పాదయాత్ర విజయవంతం అయిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలియజేశారు. జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ‘మహా పాదయాత్ర’కు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నలు మూలల నుండి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కనీవినీ ఎరగని రీతిలో ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు అని, పాదయాత్ర కు వచ్చి తిరిగి స్వస్థలాలకు వెళ్లే కార్యకర్తలు, నాయకులంతా జాగ్రత్తగా వెళ్లాలని కోరారు.