కమ్ముకున్న పొగ మంచు ఇబ్బందులు పడ్డ జనం

23-11-2026 | 07:24pm

బోథ్ నవంబర్ 22 (విజయక్రాంతి): మండలంలో సోమవారం ఉదయం కురిసిన పొగ మంచు వల్ల జనం ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుండి భారీగా పొగ మంచు కురవడంతో రోడ్లపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో సతమతమయ్యారు. ఇక మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు పొగ మంచు వల్ల చేతికిందే కంది పంట కు నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా భారీగా కురిసిన పొగ మంచు రైతన్న ఇబ్బందులకు గురిచేసింది.

మరిన్ని వార్తలు