సంవిధాన్ రక్షా మార్చ్ ర్యాలీకి తరలిరండి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పిలుపు
ములుగు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్ష మార్చ్(Samvidhan Raksha March) రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్(Congress District President Paidakula Ashok) పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10:30 గంటలకు, హైదరాబాద్ నందు గల ట్యాంక్ బండ్ నందు ఏఐసీసీ ఆదేశాల మేరకు, టీపీసీసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కార్యక్రమం నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించనైనది.
ఈ ర్యాలీ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జీ బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దనసరి సీతక్క, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ములుగు జిల్లాలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధాల సంఘాల, మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు.