దురదపాడులో కార్డెన్ అండ్ సెర్చ్
దమ్మపేట,(విజయక్రాంతి): బుధవారం తెల్లవారుజామున దమ్మపేట పోలీస్ స్టేషన్(Dammapeta Police Station) పరిధిలోని దురదపాడు గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఆశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు(Ashwaraopeta CI P. Nagaraju) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పీ.నాగరాజు గ్రామస్థులతో మాట్లాడుతూ... మాదక ద్రవ్యాల వినియోగం ముఖ్యంగా గంజాయి వినియోగించడం, అక్రమ రవాణా, మూఢనమ్మకాలు, కోడిపందేలు, పేకాట వంటి జూదాల వల్ల కలిగే నష్టాలు, రహదారి భద్రత, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 101ఇళ్లను తనిఖీ చేసి, 67 బైక్లు, 5 ప్యాసింజర్ ఆటోలు, 2 ట్రాక్టర్లు ఒక బొల్లెరో వాహన పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్ ఐ బి రాజేష్ కుమార్, దమ్మపేట అదనపు ఎస్ఐ, అశ్వరావుపేట ఎస్ ఐ, ఆశ్వారావుపేట సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.