మూడేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్‌పాల్

25-11-2026 | 12:24pm

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు

కొడంగల్, మధిరతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకే వేల కోట్ల నిధులు

బోధన్ నవంబర్ 25(విజయ క్రాంతి): కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఎమ్మెల్యే ఫండ్) కేటాయించని పరిస్థితి తెలంగాణలోనే ఉందని విమర్శించారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ కూడా మంజూరు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రజా అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం, కొడంగల్, మధిర నియోజకవర్గాలతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకే వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోందని ధన్‌పాల్ ఆరోపించారు. మిగతా ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు సహకరించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు