కరువు మండలంగా ప్రకటించాలి
19-11-2026 | 01:25pm
తలమడుగు, నవంబర్ 19 (విజయక్రాంతి): తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న రైతు జేఏసీ ఆధ్వర్యంలో సుంకిడి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల రైతు జేఏసీ (Farmers JAC) నాయకులు పాల్గొన్నారు.