మారుతున్న భారత్‌కు వైభవ్ ప్రతీక
క్రికెట్ బ్యాట్‌తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.. వైభవ్‌పై ప్రత్యేక ప్రశంసలు!
చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ యువ క్రికెటర్.. అంతర్జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా TIME100 Next India జాబితాలో చోటు దక్కించుకోవడంతో అతడి పేరు మరోసారి మార్మోగుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా వైభవ్ ప్రయాణం, విజయాలను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ఓ Note రాశారు.
కేవలం 14 ఏళ్ల వయసులోనే Indian Premier League (IPL) చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందాడు. 2026లో రికార్డులు సృష్టించిన మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అతడి కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయాలు అతడి ప్రతిభకు నిదర్శనమని ఆయుష్మాన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అసాధారణమైన ప్రతిభ వెలుగులోకి రావచ్చని వైభవ్ నిరూపిస్తున్నాడని పేర్కొన్నారు.
మైదానంలో వైభవ్ బ్యాట్ ఝుళిపిస్తున్న తీరు భవిష్యత్తు భిన్నంగా ఆలోచించే యువతదేనని గుర్తుచేస్తోందని ఆయుష్మాన్ తన నోట్లో తెలిపారు. అతడి విజయం కేవలం పరుగులు, రికార్డులకే పరిమితం కాదని.. కొత్త తరం కలలు, ఆశయాలకు ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు. కోటి ఆశయాలకు సరైన అవకాశాలు తోడైతే యువత ఎంతటి అద్భుతాలు సృష్టించగలదో వైభవ్ ప్రయాణం చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.