గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి
పలిమెల, నవంబర్ 19 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బోడాయిగూడెం గ్రామంలో అక్రమ గుడుంబా స్థావరంపై పోలీసులు దాడి (Police Raid) నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక ఉన్న పత్తి చేను వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్కడే గుర్తించిన 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం (Seizure) చేసుకున్నారు.
ఈ సందర్భంగా పలిమెల ఎస్సై టి. సాయి శశాంక్ మాట్లాడుతూ అక్రమంగా గుడుంబా తయారు చేయడం (Illegal Brewing), నిల్వ ఉంచడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేపట్టినట్లు తెలిపారు.