భారత్ సరికొత్త ఆట ఆడుతోంది: మోదీ పోస్ట్ వైరల్!
GTA 6తో మోదీ స్పెషల్ పోస్ట్.. 13 ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతి ఇదే!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా Gaming Lovers ఆసక్తిగా ఎదురుచూస్తున్న GTA 6 విడుదలను ప్రధాని నరేంద్ర మోదీ వినూత్నంగా ఉపయోగించుకున్నారు. గత 13 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ధిని GTA గేమ్ థీమ్‌తో పోలుస్తూ ఆయన అధికారిక Instagram ఖాతాలో ఓ ఆసక్తికరమైన Post షేర్ చేశారు. ‘India is playing a whole new game’ అనే Captionతో వచ్చిన ఈ పోస్ట్ ప్రస్తుతం Social Mediaలో చర్చనీయాంశంగా మారింది.
2013లో విడుదలైన GTA 5 నుంచి 2026లో వచ్చిన GTA 6 వరకు భారత్‌లో చోటుచేసుకున్న మార్పులను ఈ Postలో వివరించారు. ఒకప్పుడు ‘Fragile 5’ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. పేదరికం తగ్గుదల, స్వచ్ఛ భారత్ మిషన్, Solar Power సామర్థ్యం పెరుగుదల, విద్యుదీకరణ, అంతరిక్ష రంగంలో 440 నమోదిత Startups వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే హైస్పీడ్ Internet ధర GBకు రూ.308 నుంచి రూ.7.51కు తగ్గిందని, నక్సలిజం ప్రభావం తగ్గడం, Defence Exportsలో భారత్ ఎదుగుదల వంటి విజయాలను కూడా ప్రస్తావించారు.
ఈ పోస్టులో GTA గేమ్స్‌కు ప్రత్యేకమైన Pricedown Fontను ఉపయోగించడం మరో ఆకర్షణగా నిలిచింది. యువత, Gaming Communityని ఆకట్టుకునేలా రూపొందించిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. షేర్ చేసిన పది నిమిషాల్లోనే దాదాపు 60 వేల Likes, 2 వేల Comments వచ్చాయని కథనంలో పేర్కొన్నారు. పలువురు మోదీని ‘Coolest Prime Minister’ అంటూ ప్రశంసించారు. కాగా, GTA 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత GTA 6 గురువారం అర్ధరాత్రి విడుదలైంది. ఈ గేమ్ అభివృద్ధికి బిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు అంచనాలు ఉండగా, Pre-orders ద్వారానే సుమారు 1.1 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు Sensor Tower అంచనా వేసింది.