అర్హులైన పేదలకు ఇళ్ల సాయం ఏదీ?

19-11-2026 | 01:28pm

ఖానాపూర్ (విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) సహాయం అందించాలని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం (Housing Scheme) అమలులో అన్యాయానికి గురైన పేద కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు.

గురువారం కడెం మండలంలో బాధితులు సయ్యద్ ముజాద్దీన్, హైమద్ ఖాన్ గృహాల వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజమైన లబ్ధిదారులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం అన్యాయమని అన్నారు. అర్హత కలిగిన పేదలను గుర్తించి ప్రభుత్వ పథకం (Government Scheme) ద్వారా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం (Financial Assistance) అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు