కన్నాయిగూడెం అటవీ శాఖలో కలప స్మగ్లింగ్

19-11-2026 | 01:20pm

కన్నాయిగూడెం, నవంబర్ 19 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల అటవీ శాఖలో కలప స్మగ్లింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీ శాఖలో పనిచేస్తున్న సుమారు 8 మంది సిబ్బందిపై డిప్యూటీ రేంజ్ అధికారి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టేకు, జిట్రేగి కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెండు వాహనాలకు డబ్బులు తీసుకుని, ఫారెస్ట్ సిబ్బంది (Forest Staff) స్మగ్లర్లకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఓ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అటవీ శాఖలోని కొందరు సిబ్బందిపైనే అక్రమ కలప రవాణా (Timber Smuggling) ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ (Investigation) కొనసాగుతుండగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు