ఇందిరమ్మ బాటలోనే సంక్షేమ పాలన: నీలం మధు

19-11-2026 | 01:12pm

పటాన్‌చెరు, నవంబర్ 19 (విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానిగా తన పాలనా దక్షత, దృఢ సంకల్పంతో దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఉక్కు మహిళ, భారతరత్న ఇందిరాగాంధీ (Indira Gandhi) అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.

ఇందిరాగాంధీ 109వ జయంతి (Birth Anniversary) సందర్భంగా గురువారం చిట్కూల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సంక్షేమ పథకాలతో సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహానేతగా ఆమె ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు.

ఇందిరాగాంధీ ఆశయాలు, పాలనా స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా గురువారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Life Insurance Scheme) ప్రారంభం కానుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగన్నగారి గోపాల్, దస్తగిరి, సందీప్ గౌడ్, నాయకులు ముత్తంగి అశోక్, దండోరా నరసింహ, సందీప్ యాదవ్, ముత్యాలు, వీరేష్, గణేష్, అనిల్, రంజిత్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు