అలాయ్ బలాయ్ కార్యక్రమం

16-10-2026 | 04:35pm

ఆలేరులో బండు శోభారాణి

ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండు శోభారాణి(Bandu Shobharani) ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని(Alai Balai program) నిర్వహించనున్నారు. అక్టోబర్ 25, ఆదివారం రోజున ఆలేరు  మైనారిటీ ఫంక్షన్ హల్ లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే ఇలాంటి కార్యక్రమాలు ఆలేరు పట్టణంలో నిర్వహించడం పట్ల బండ్రు నర్సింహులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడానికి దోహదపడతాయని వారు పేర్కొంటున్నారు, ఈ కార్యక్రమానికి ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు