పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

24-11-2026 | 10:12pm

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, అనేక కుటుంబాలకు పరామర్శ

ఖమ్మం రూరల్/ఏదులాపురం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మంగళవారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం నరసింహాపురంలో.. సూరం శెట్టి రేణు బాబుకు ఇటీవల శస్త్ర చికిత్స జరగగా.. మంత్రి ఆయనను పరామర్శించారు. ఆరెంపుల గ్రామంలో  కాంగ్రెస్ నాయకులు గుండె వెంకన్న ఇటీవల చనిపోగా.. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురంలో చిదుముల వెంకటరెడ్డి తల్లి చనిపోగా.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రామన్నపేట కాలనీ 60వ డివిజన్ లో అంతర్గత సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టేకులపల్లిలో పొదిల చిన్న పాపారావు కుమారుని వివాహం కాగా.. నూతన జంటను ఆశీర్వదించారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాగంటి నారాయణకు ఇటీవల శస్త్ర చికిత్స జరగగా.. మంత్రి పొంగులేటి పరామర్శించి.. ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో.. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాతీగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెడ్లుగా, రెండు కళ్లుగా భావిస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి.. వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కాంగ్రెస్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షులు భానోత్ కిషోర్ నాయక్, ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, డివిజన్ల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు