అక్రమంగా తరలిస్తున్న 22 పశువులు పట్టివేత

24-11-2026 | 10:17pm

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలింపు..

డీసీఎం వాహనం సీజ్‌..

నలుగురిపై కేసు నమోదు..

టేకులపల్లి, (విజయక్రాంతి): ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 6 ఆవులను టేకులపల్లి పోలీసులు(Tekulapalli Police) పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, డీసీఎం వాహనాన్ని సీజ్‌ చేసినట్లు టేకులపల్లి ఎస్సై తిరుపతి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు.

అందులో 16 ఎద్దులు, 6 ఆవులు ఉన్నట్లు గుర్తించారు. పశువులను స్వాధీనం చేసుకొని, తరలింపునకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సరూర్‌నగర్‌కు చెందిన జలా రాజు, రంగారెడ్డి జిల్లా తట్టినాగారానికి చెందిన ఉదరా భరత్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కంగుల రాజు, జబ్దార్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పశువుల అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు