భద్రకాళి ఆలయంలో ‘జ్వాలాతోరణం'
వరంగల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వరంగల్ మహానగరంలోని భద్రకాళి క్షేత్రం(Warangal Bhadrakali Temple)లో స్వయం వ్యక్తమైన తేజ మూర్తి అనగా అగ్ని లింగ క్షేత్రమైన భద్రేశ్వర స్వామి వారికి శైవాగమాన్ని అనుసరించి జపహోమ సురార్చినలు జరపడంతో పాటు ‘జ్వాలాతోరణం' నిర్వహించారు.
ఈ జ్వాలా తోరణం నుండి ఐదు సార్లు శంకరుని అమ్మవారిని తీసుకువచ్చాగా భక్తులందరూ కూడా ఈ జ్వాలాతోరణం కింద నుంచి ఒకసారి వెళ్లి తిరిగి వస్తె, తద్వారా మనిషి తాను చేసిన పాపాలన్నీ భస్మమైపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వందలాది మంది భక్తులు ఈ జ్వాలాతోరణం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, కమటం వేణుగోపాల్, వల్లూరి పవన్ కుమార్, కారెంగుల సురేష్ బాబు, చితురాల అంజనీదేవి, రమేష్ చంద్ భంగ్, మాడిశెట్టి సతీష్, పేరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.