కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

30-10-2026 | 11:46pm

తలమడుగు,(విజయక్రాంతి): నవంబర్ 1న తలమడుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్న నేపథ్యంలో అనంతరం నిర్వహించే ప్రెస్‌మీట్ కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు