ఇవాళ గణపతికి ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా..?
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. భాద్రపద శుద్ధ చవితి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో గణనాథుడికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున వినాయకుడి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రానుంది. అయితే ఈ తొమ్మిది రోజులు వినాయకుడి నేవేద్యం సమర్పిస్తుంటారు.. ఇవాళ రెండో రోజు గణపయ్యకు ఏం నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందా..
సెప్టెంబర్ 15 ..(భాద్రపద శుద్ధ పంచమి).. వికట వినాయకుడిని పూజించాలి. లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి.