బీరు బాటిల్ తో దాడి కలకలం..

24-11-2026 | 09:58pm

* ఆదిలాబాద్ లో ఘటన ఒకరికి తీవ్ర గాయాలు...

ఆదిలాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో బీరు బాటిల్ తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ చౌక్ లోని వైన్స్ సమీపంలో మంగళవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ నెలకొంది. ఈ ఘటనలో అతిక్ ఖురేషి పొట్టలో బీర్ బాటిల్ తో ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. దాడి చేసిన వ్యక్తి అక్కడ నుంచి పరార్ అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు