నాయకమ్మ ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
16-10-2026 | 05:09pm
తాడ్వాయి,అక్టోబర్,16( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలోని నాయికమ్మ ఆలయంలో(Nayikamma Temple) శుక్రవారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు నాయకమ్మ సేవ సమితి(Nayakamma Seva Samiti) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో(Devotional) పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.గ్రామం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.