మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం

16-10-2026 | 05:03pm

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ): ఈనెల 13వ తేదీన   అనుమానస్పదంలో  మృతి చెందిన  రాథోడ్ అరవింద్, రాథోడ్ ప్రవీణ్ కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని  హార్కాపూర్ లోని రెండు కుటుంబాలను పరామర్శించి  ఒక్కొక్క కుటుంబానికి  పదివేల చొప్పున  నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రెండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తో పాటు  వితంతు పెన్షన్  వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని  అన్నారు. అన్నదమ్ముల పిల్లలను విద్యను అభ్యసంచేందుకు  ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి  వారి చదువుపై దృష్టి సారిస్తామని  హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట  సర్పంచ్ రాథోడ్ రోహిదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, గ్రామ నాయక్ చవాన్ ఉమాజీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు