బీజేపీ నాయకులకు జిల్లా స్థాయి కీలక పదవులు
నూతనంగా నియమితులైన నాయకులకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం.
కోనరావుపేట అక్టోబర్ 16 (విజయక్రాంతి):కోనరావుపేట మండలానికి చెందిన బీజేపీ నాయకులకు(BJP leaders) జిల్లా స్థాయిలో కీలక పదవులు లభించాయి. కిసాన్ మోర్చా(Kisan Morcha) జిల్లా ఉపాధ్యక్షుడిగా జింక వెంకటి, కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మోత్కూ మోహన్, బెంద్రపు శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిన్నా అనిల్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులను బీజేపీ శ్రేణులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.తమ నియామకాలకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్, రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనారాయణ,
జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జలపతి రెడ్డి, కోనరావుపేట మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ, మాజీ మండల అధ్యక్షుడు గొట్టే రామచంద్రంలకు నూతనంగా నియమితులైన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.