సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

16-10-2026 | 05:12pm

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడిన

ఉద్యమకారుల ప్రయోజనాలు పొందేందుకు అర్హులకే అవకాశం కల్పించాలి 

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్..

రామాయంపేట: అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : రామాయంపేట మండలంలో(Ramayampet Mandal) తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులను(Telangana activists) గుర్తించి, వారికి అందిస్తామని ప్రకటించిన సంక్షేమ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం(Welfare of Telangana Movement Activists) కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు ఉద్యమకారులు పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులను తగిన విధంగా గుర్తించలేదని వారు విమర్శించారు.

అలాగే, తెలంగాణ ఉద్యమం పేరుతో ఇప్పటికే లబ్ధి పొందినవారు, పదేళ్లపాటు అధికార పదవులు అనుభవించినవారిని ఉద్యమకారుల జాబితాలో చేర్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు. కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కుమార్ సాగర్, బాలరాజ్ గౌడ్, ఉద్యమకారుడు పోలీస్ దేవేందర్, అంచనూరి రాజేశ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు