జాతర ఏర్పాట్లు బాగుండాలి
నిర్మల్ అక్టోబర్ 16 ( విజయ క్రాంతి): సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని(Adelli Village) శ్రీ మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఏర్పాట్లు భక్తులకు బాగుండాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం ఆలయ ఈఓ భూమయ్య ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శ్రీనివాస్ శర్మ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జాతర వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ తుక్కారం, కౌట్ల (బి) ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.