కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

16-10-2026 | 05:19pm

కంచర్ల హిమశ్రీ 18 వ డివిజన్ కార్పొరేటర్ ...

కొత్తగూడెం అక్టోబర్ 15 (విజయక్రాంతి) : అన్నం పరబ్రహ్మ స్వరూపం  అమ్మవారి కృప తో శుక్రవారం పంజాబ్ గడ్డ ఇందిరమ్మ కాలనీ(Indiramma Colony) 18వ డివిజన్లో, శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల(Sri Kanaka Durga Devi Navratri Festival) సందర్భంగా, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ,18 వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ(Corporator Kancharla Himasri), ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదానం(Donation of food) చేయడం వలన ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చడం తో, పాటు అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కృపకు పాత్రులోడం ఎంతో విశిష్టమైన విశేషం.

ఎల్లవేళలా బీద బడుగు బలహీన వర్గాల ఆకలిని తీర్చడం అనేది అమ్మవారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అని అమ్మవారి ఇచ్చిన ఈ శక్తి సామర్ధ్యాలతో నిత్యం, నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడానికి గొప్ప అవకాశం ఇచ్చిన అమ్మవారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి కృపకు పాత్రులైన ప్రతి ఒక్కరూ ,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. 

అన్ని దానములో కన్నా అన్నదానం మిన్నని శాస్త్రాలు చెబుతా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఉన్నదాంట్లో నిరుపేదలకు భక్తిశ్రద్ధలతో అన్నదానం చేయడం అనేది మహా పుణ్య కార్యమని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పాటి మోహన్ రావు, మండల రాజేశ్వరరావు, రాజాని దేవదాస్, నెండ్రా కృష్ణ, అనిల్, పవన్ కుమార్, చప్పిడి కోటేశ్వరరావు, రాకేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు