ఆకట్టుకున్న చిన్నారి ప్రదర్శన

16-10-2026 | 05:22pm

నిర్మల్, అక్టోబర్ 16 ( విజయ క్రాంతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో(Sri Bhadrakali Temple) నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో (Cultural Program)సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన మామిళ్ల సహస్ర నృత్య ప్రదర్శన ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయంలో ప్రదర్శన ఇవ్వడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు