పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘం
16-10-2026 | 05:20pm
బోథ్. అక్టోబర్ 16 (విజయ క్రాంతి) సోనాల మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులకు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యవర్గంలో(PRTU TS State Executive Committee) చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఓసశ్రీనివాస్, సెక్రటరీగా జల ఆనంద్ , ఓ ప్రకాష్ లకు కార్యవర్గంలో చోటు లభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం పదవులు కట్టబెట్టడంతో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు.