టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీగా మెస్రం దయాకర్

15-09-2026 | 11:33am

ఉట్నూర్,సెప్టెంబర్ 14(విజయక్రాంతి): ఖానాపూర్(Khanapur) నియోజకవర్గ  తెలంగాణ రక్షణ సేన  ఇన్చార్జిగా  కిస్లాపూర్ గ్రామానికి చెందిన  యువకుడు మెస్రం దయాకర్ ను ఇన్చార్జి గా నియమిస్తూ  తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. వినాయక చవితి పండగ సందర్భంగా  రాష్ట్రంలోని  18 నియోజకవర్గాలకు  ఇన్చార్జిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం  ఇన్చార్జిగా  మెస్రం దయాకర్ ను నియమించారు. మెస్రం దయాకర్ తాత మెస్రం  దేవరావు  1981  లో ఉట్నూర్ సమితి  అధ్యక్షుడుగా  పనిచేశారు.

బోథ్ ఎమ్మెల్యేగా సైతం పోటీ చేసిన అనుభవం ఉంది. ఆదివాసుల  ఆరాధ్య దేవుడు  నాగోబాను పూజించే  కుటుంబం నుండి తెలంగాణ రక్షణ సేన గుర్తించడం పై మెస్రం వంశీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో  తెలంగాణ రక్షణ సేన పార్టీని  గ్రామస్థాయి నుండి  బలోపేతం చేస్తానని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని   పరిష్కరించే దిశగా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని  ఈ సందర్భంగా అన్నారు. యువకుడిగా తనకు ఇన్చార్జి అవకాశం కల్పించిన  పార్టీ అధ్యక్షురాలు అక్క కల్వకుంట కవితకు  కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు