గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
18-10-2026 | 04:16pm
బోథ్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadav Anil) పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గండేపల్లి గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో కలిసి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్కరాజు సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి, గ్రంథాల సంస్థ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్ తదితరులు ఉన్నారు.