ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

21-11-2026 | 02:56pm

ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన  ఇంద్రమ్మ బీమా పథకాన్ని(Indramma Insurance Scheme)  ప్రతి పేదవాడు సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ కార్డులో ఉన్న  ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శనివారం ఉట్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా(Indiramma Jeevitha Bima) పథకం దరఖాస్తుల ప్రక్రియను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పరిశీలించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను, లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు ఇంద్రమ్మ బీమా పథకాన్ని  ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు