సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ

26-11-2026 | 07:42pm

దమ్మపేట, నవంబర్ 15(విజయ క్రాంతి): మండల కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సంఘాల(Samyukta Kisan Morcha National Body) పిలుపు లో బాగంగా  దమ్మపేట పట్టణంలో  రైతు సంఘాలు సంయుక్తంగా మల్లారం క్రాస్ రోడ్డు నుండి బాలాజీ థియేటర్ వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ అవలంబిస్తున్న రైతు, కార్మిక  వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బాలాజీ థియేటర్ సెంటర్ లో  సిపిఎం ఎల్ ప్రజాపంధా మాస్ లైన్ జిల్లా నాయకురాలు  తోడెం దుర్గక్క అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో తెలంగాణా రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా లక్ష్మినారాయణ, సీనియర్ రైతు నాయకులు యండ్రాతి అప్పారావు, తోడెం దుర్గక్క లు మాట్లాడుతూ 2020 సంవత్సరం నవంబర్ 26న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు.

కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఉద్యమం సమయంలో వ్రాతపూర్వకంగా ఇచ్చి న హామీలను అమలు చేయాలని, ఎం ఎస్ పి  మద్దతు ధరలు చట్ట బద్దంగా చట్టం చేయాలని కోరారు. స్వామి నాధన్ కమిటీ సిఫారసు లు అమలు చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని, విదేశీ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలని అన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధులు అధికంగా కెటాయించాలని, 60 సంవత్సరాలు నిండిన రైతులకు నెలకు 10 వేలు పించన్ ఇవ్వాలని అన్నారు.

మురసు తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని కల్పించాలని, రోజు కూలి 700 రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆభోతు చెన్న కేశవులు, యండ్రాతి సత్యనారాయణ, మాదాసు సుదర్శన రావు, తామా రాముడు,  కుంజా కాంతారావు, పూజల సంజీవరావు, కీసరి వెంకటేష్, చెన్ను బోయిన బ్రహ్మయ్య, రైతుసంఘం మండల అధ్యక్షులు మోరంపూడి రామ మోహన రావు, కొండారు యల్లమంద,  మోరంపూడి సూర్య నారాయణ, కీసరి ధర్మయ్య, మడివి లక్ష్ముడు,  గంగాధర వీర రాఘవులు, కీసరి రాముడు, కోమటి వెంకటేశ్వరరావు, కీసరి పెద్దవెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు