సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

26-11-2026 | 07:37pm

జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి 

చేగుంట నవంబర్26:(విజయక్రాంతి): భారత రాజ్యాంగం(Constitution of India) ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వాన్ని అందించిందని చేగుంట ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి అన్నారు . భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదని,

ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచమని, సమానత్వానికి ప్రతీకగా, ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమేనని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ శివల భాస్కర్ జర్నల్ సింగ్ కుర్ర లక్ష్మణ్ ప్రేమ్ రాజు సింగ్ ఉమేష్ పుర్ర రవి బుర్ర కుమార్ అక్బర్ బీసీ నాయకులు ఆంజనేయులు సోమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు