రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలి
కొండపాక, నవంబర్ 26(విజయక్రాంతి ):కొండపాక గ్రామపంచాయతీ(Kondapaka Grama Panchayat) కార్యాలయ ఆవరణలో గురువారం రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నవీన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఐక్యత, సమానత్వం, సోదరభావంతో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాల్గొన్న వారందరూ రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కొండపాక గ్రామ సర్పంచ్ మంచాల నవీన, పాలకవర్గం సభ్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ నాయకులు, యువత పాల్గొన్నారు.