అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు
బందారం లో నూతన చేయూత పింఛన్ల ప్రోసిడింగ్ కాపీల అందజేత
కొండపాక, నవంబర్ 26( విజయ క్రాంతి):మండలంలోని బందారం గ్రామంలో(Bandaram Village) సర్పంచ్ కొలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల('Cheyutha' pensions) లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్ట పరశురాములు, కార్యదర్శి రాజమణి, ఉపసర్పంచ్ కట్ట నవీన్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లె నరేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు బట్ట నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలుపుల ఐలయ్య, గ్రామ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.