డిగ్రీ కళాశాలలో ‘రాజ్యాంగ దినోత్సవం’
నిర్మల్ నవంబర్ 26 ( విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Government Degree College) ‘రాజ్యాంగ దినోత్సవం’ (కాన్స్టిట్యూషన్ డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు . ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ ఓ నాగ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ హేమలత, డాక్టర్ పి జి రెడ్డి, కట్టా రమేష్ రెడ్డి, జి సుభాష్, డాక్టర్ పవన్ కుమార్, దిలీప్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు