డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధం
బోథ్. నవంబర్ 3. ( విజయక్రాంతి.) రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల(State government ASHA workers) సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆశ వర్కర్స్ అధ్యక్షురాలు డి సరస్వతి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సోనాల మండల వైద్యాధికారి నవీన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్రభుత్వ ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
18 వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. అంతేగాక ఈపీఎఫ్ సౌకర్యం కల్పించి సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పైన స్పందించకపోతే రానున్న డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె లో పాల్గొంటామన్నారు. సంవత్సర పైన రాష్ట్రస్థాయిలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అనంతరం మండల స్థాయిలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సోనాల. బోథ్ మండలాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.