మొదటి రోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం విజయవంతం

03-11-2026 | 03:40pm

గండీడ్,విజయక్రాంతి: మండల పరిధిలోని సల్కర్‌పేట్ ఉన్నత పాఠశాలలో(Salkarpet High School) ప్రాథమిక పాఠశాలల 50 శాతం ఉపాధ్యాయులతో నిర్వహించిన మొదటి రోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం విజయవంతంగా ముగిసింది. మిడ్‌లైన్ పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలనే అంశంపై రిసోర్స్ పర్సన్లు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులకు చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని, విద్యాశాఖ చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని వెన్నచేడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవిబాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ రుద్రారం జనార్ధన్,వెన్నచేడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవిబాబు,సల్కర్‌పేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, రిసోర్స్ పర్సన్లు కుర్మయ్య, శ్రీనివాస్, కేశవులు, వాసంతి, సరిత,పీఆర్‌టీయూ టీఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పగిడ్యాల బోరు కృష్ణయ్య, పీఆర్‌టీయూ తెలంగాణ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, టీఎస్ సీపీఎస్ ఈయూ మండల అధ్యక్షులు దోమ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీంబాద్ కృష

మరిన్ని వార్తలు