లోదా కులస్తుల ప్రాంతాన్ని పరిశీలించిన బీసీ కమిషన్

16-09-2026 | 08:26pm

సిర్గాపూర్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని లోదా కులస్తులు నివసించే ప్రాంతాన్ని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిటీ సభ్యులు, సబ్ కలెక్టర్ ఉమాహారతి(Sub-Collector Uma Harathi)తో కలిసి బుధవారం నాడు పరిశీలించారు. స్థానికంగా ఉన్న 300 మంది లోదా కులస్థులను, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కట్టుబొట్టు, ఆచార సంప్రదాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బీసీ సామాజిక వర్గంలో తమకు న్యాయం చేయాలని వారు కమిషన్ను కోరారు. 

కడ్పల్ సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి:- 

కడ్పల్ సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను కలిసి లోథా కులస్తుల సమస్యలను వివరించారు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారని తెలిపారు. కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య ను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

లోదా కుల పెద్ద నాయకుని సాయిలు వివరణ:- 

కులానికి గుర్తింపు ఇవ్వాలని కడపల్లో లోధా కులస్తులు ప్రభుత్వాన్ని బుధవారం కోరారు. రెండు వందల సంవత్సరాల నుంచి తమ కులానికి చెందిన వారు ఇక్కడ నివాసం ఉంటున్నారని, కానీ తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. తద్వారా విద్యార్థులకు యువతకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ జి. మహేష్, యాదవ్ రెడ్డి, లోదా కులస్థులు గ్రామస్థులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు