ధూమ్ ధామ్ పురిటిగడ్డ కామారెడ్డి
- సబ్బండ వర్గాలను ఏకం చేసిన చరిత్ర కేసీఆర్ ది
- తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం
- కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో ఆదివారం తెలంగాణ జిల్లా దశాబ్ది ఉత్సవాలు(Telangana District Decennial Celebrations) ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ కారులను(Telangana activists), న్యాయవాదులను(Lawyers), డాక్టర్లను, విద్యార్థి ఉద్యమ కారులను(Student activists), గాయకులను, జర్నలిస్టులను మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్(Gampa Govardhan), జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే లు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ లు శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Govardhan) మాట్లాడుతూ తెలంగాణ ధూంధాం కార్యక్రమం(Telangana Dhoom Dhaam Program) కామారెడ్డి గడ్డపైని పురుడు పోసుకుందన్నారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులు కేసీఆర్ అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు మేరకు అన్ని నూతన జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యంగా కోసం 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కట్టించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కుంభాల రవి యాదవ్, మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి, బలవంతరావు, హనుమాన్, మాచారెడ్డి, బిబిపేట్, భిక్కనూర్, దోమకొండ, కామారెడ్డి, మండలాల బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.