పట్టభద్రులారా.. ఓటు నమోదు చేసుకోండి

28-09-2026 | 07:30pm

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి

ఇల్లెందు, (విజయక్రాంతి): ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

2023 నవంబర్‌ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి, 2026 నవంబర్‌ 1 నాటికి మూడేళ్లు పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 28 నుంచి నవంబర్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఫారం–18తో పాటు డిగ్రీ ఒరిజినల్‌/ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ కాపీ, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, చిరునామా ఆధారంగా ఓటర్‌ ఐడీ లేదా రేషన్‌ కార్డు వంటి పత్రాలను తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన పట్టభద్రులంతా వెంటనే ఓటు నమోదు చేసుకోవాలని కోరం కనకయ్య కోరారు. నమోదు ప్రక్రియపై సందేహాలుంటే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సంఘం అధికారిక ఓటర్‌ సేవల ద్వారా కూడా ఓటరు వివరాలను పరిశీలించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు