మినీ గురుకులం పాఠశాలలో బ్యాక్ లాగ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ

27-10-2026 | 08:49pm

మణుగూరు/పినపాక, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఐలాపురం గ్రామంలో గల గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకులం(Tribal Welfare Department Mini Gurukulam) ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం గాను ఐదవ తరగతిలో 5 సీట్లు, బ్యాక్ లాగ్ సీట్లకు అర్హత కలిగిన విద్యార్థినిల నుండి నేటి నుండి ఈ నెల 30వ, తారీకు వరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి(అర్ సీఓ) బి అరుణ కుమారి అదేశల మేరకు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు ఎమ్ శకుంతల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.

అలాగే మొదటి ప్రాధాన్యత పినపాక మండలం విద్యార్థినిలకు మాత్రమే ఉంటుందని రెండో ప్రాధాన్యత మిగతా మండలాల విద్యార్థులకు ఉంటుందని ఆమె తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు మినీ గురుకులం పాఠశాలలో దరఖాస్తు చేయడానికి స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ పొందపరచగలరని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియ లాటరీ పద్ధతిలో తీయబడుతుందని అన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యా బోధన ఉంటుందని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు