కోడి పందాల స్థావరంపై దాడి
15-09-2026 | 12:42pm
అశ్వారావుపేట (విజయ క్రాంతి): అశ్వారావుపేట(Aswaraopeta) మండలంలోని వడ్డే రంగాపురం గ్రామ శివారులో కోడి పందాలపై ఎస్ ఐ యయాతి రాజు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి రూ. 1500 రూపాయల నగదు, రెండు కోడి పుంజులు, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ ఐ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ ఐ తెలిపారు. వారి వద్ద నుండి రూ. 800 రూపాయల నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరి ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. కోడి పందాలు, పేకాట స్థావరాలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్టు ఎస్ ఐ యయాతి రాజు తెలిపారు.