టీఆర్ఎస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జీగా వేణుగోపాల్
15-09-2026 | 01:13pm
ఆదిలాబాద్, సెప్టెంబర్ 14, (విజయక్రాంతి) : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని రాష్ట్రంలో మరింత బలుపేతం చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జిలో నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ ఇంచార్జీ ల పేర్లను ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ సీనియర్ నాయకుడు వేణు గోపాల్ యాదవ్ ను నియమించారు.
సోమవారం ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నూతన నియోజకవర్గ ఇంచార్జి ప్రకటించారు. నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలపై ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కవిత సూచించారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ కమిటీలను మండలాల వారీగా, గ్రామాల వారిగా నియమించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.