మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు శ్రీకారం

15-09-2026 | 01:37pm

రూ.10లక్షల నిధులతో నిర్మాణం

సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్

సిద్దిపేట రూరల్,సెప్టెంబర్ 15: గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులను సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ ప్రారంభించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కృషితో రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతూ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిధులు మంజూరు చేసిన హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సెక్రటరీ రమాదేవి, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు, CAలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు