బైకుపై వెళుతున్న యువకుడు మృతి
15-09-2026 | 01:32pm
కొండపాక,సెప్టెంబర్ 15:(విజయ క్రాంతి): దుద్దెడ నుంచి అంకిరెడ్డిపల్లి(Ankireddypalli)కి బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడి మృతి చెందిన యువకుడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొండపాక మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రాశుల శ్రీకాంత్ (27) దుద్దెడ నుంచి బైకుపై అంకిరెడ్డిపల్లికి వెళుతుండగా మట్టి పైపులు ఫ్యాక్టరీ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయి ఉన్నాడు. అటుగా వెళుతున్న స్థానికులు ఎవరో కింద పడిపోయి ఉన్నట్లు దగ్గరకు వెళ్లి చూడగా అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాసుల శ్రీకాంత్ గా గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.