అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహణ వేలం పాటలు
16-09-2026 | 06:17pm
పాల్గొన్న డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ శ్రీస్వామి అయ్యప్ప దేవాలయం(Palvancha Sri Swamy Ayyappa Temple)లో సీజన్ లో నిర్వహించడానికి బుధవారం వేలం పాటలు(Auction) నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో నిర్వహించే పూజాసామాగ్రి దుకాణానికి రూ 2 లక్షలకు, టీ కొట్టు నిర్వహణ రూ 1 లక్షకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంపాట కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేవాలయం లో ప్రతి బుధవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కొత్వాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ట్రస్ట్ సభ్యులు బందెల శ్రీనివాస్, మేడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, భక్తులు పాల్గొన్నారు.