వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- పోచమ్మ చెరువులో నిమజ్జనం
- అదిరిపోయిన ముగింపు వేడుకలు
- వాడవాడలా సద్దుల పండుగ
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) అంబరాన్నంటాయి. వాడవాడలా బతుకమ్మ సంబురాలు సందిడి చేశాయి. రంగు రంగుల పూలను సేకరించి బతుకమ్మ ను అందంగా తీర్చిదిద్దారు.గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి మహిళలు బతుకమ్మ ఆడారు. బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి(Bellampalli Municipal Chairperson Dava Swathi) సుభాష్ నగర్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ ఏ ఎం సీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీధర్ తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఆటా పాటలతో బతుకమ్మ సంబురాలు హోరెత్తిపోయాయి. భక్తి శ్రద్ధలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లులు పెద్దలు సద్దుల బతుకమ్మ వేడుకను తనీవితీరా ఆడారు. పట్టణంలో బజార్ ఏరియా, కాల్ టెక్స్, రైల్వే స్టేషన్ ఏరియా తోపాటు అన్ని వార్డుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి. ప్రధాన కూడళ్లు సద్దుల బతుకమ్మ వేడుకలకు వేదికలయ్యాయి. రాత్రంతా ఆటపాటల్లో బతుకమ్మ సంబురాల్లో మునిగిపోయారు. ఆనందోత్సవాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి.
పోచమ్మ చెరువు బతుకమ్మలను నిమజ్జనం చేసి గౌరమ్మ కు వీడుకోలు పలికారు. వందలాది బతుకమ్మలు శోభాయాత్రతో పోచమ్మ చెరువు కి చేరుకున్నాయి. ముగిపు వేడుకలు అక్కడ అట్టహాసంగా జరిగాయి. పోచమ్మ చెరువు వద్ద చేరుకున్న బతుకమ్మలకి తుది వీడుకోలు ఘట్టం అదిరిపోయింది. పోచమ్మ చెరువు వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి..