అంగరంగ వైభవంగా.. సద్దుల బతుకమ్మ
బెజ్జూర్ అక్టోబర్ 18 (విజయక్రాంతి) : బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ(Sri Ranganayaka Swamy Temple) ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) అంబరాన్ని ఉంటాయి. శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగిడిపల్లి మహేష్(Tangidipalli Mahesh) ఆలయ ప్రాంగణంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అదిరిపోయే విధంగా అలంకరించారు. చుట్టూ విద్యుత్ దీపాలు, ప్రత్యేక ముస్తాబు చేసి ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు యువతిలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సద్దుల బతుకమ్మ ఆటపాటలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తిలకించారు.