ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
18-10-2026 | 10:47pm
ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను(Saddula Bathukamma celebrations) మహిళలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం రంగురంగుల పూలతో కళకళలాడింది. మహిళలు వివిధ రకాల పూలను కొనుగోలు చేసి అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు జిల్లా అంతటా పండుగ వాతావరణాన్ని నింపాయి.